Friday, May 2, 2025
Homeతెలంగాణ రౌండప్కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిర్విరామ కృషి 

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిర్విరామ కృషి 

పీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని పీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) ఆధ్వర్యంలో నిర్వహించిన 139వ మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నరాల రత్నాకర్, మేడే జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నరాల రత్నాకర్ మాట్లాడుతూ.. కార్మికుల యొక్క శ్రమ మీదనే సంపద సృష్టించబడుతుందని, అలాంటి శ్రామిక జనానికి గుర్తింపుగా మేడే నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వాతంత్రం రాకముందు భారతదేశంలో 14 గంటల పని దినం ఉండేదని, స్వాతంత్ర్య అనంతరం ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేస్తూ, కార్మికులకు సంఘాలను పెట్టుకుని, సమ్మె చేసే హక్కుని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అదే మే డే స్ఫూర్తితో నేడు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్, కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టాన్ని రూపకల్పన చేస్తుందని అన్నారు. సీనియర్ నాయకులు జావేద్ అక్రమ్ మాట్లాడుతూ.. కార్మికులందరూ సంఘటితంగా ఉండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. వక్ప్ చట్టం తరహాలో, నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రుద్దే ప్రయత్నం చేస్తుందని, దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఐ ఎన్ టి యు సి నాయకులు మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ, మున్సిపల్ యూనియన్ నాయకులు మారుతి, ఆటో యూనియన్ నాయకులు రెహమత్, కొరియర్ డెలివరీ బాయ్స్ నాయకుడు జమీర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img