కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…
నవతెలంగాణ – రెంజల్ : ప్రజా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నిరుపేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కాకుండా ఉండేందుకే, తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిలో ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులు వీరికి అండగా ఉంటారని ఆయన చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాలలో 55 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీలను విడతల వారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఉత్తీర్ణత శాతాన్ని పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికేద క్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ ఆమ్దన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రెంజల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు జి సాయి రెడ్డి, సాయిబాబా గౌడ్, రెంజల్ సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, కురుమే శ్రీనివాస్, సురేందర్ గౌడ్, ఎం.ఎల్ రాజు, కార్తీక్, ఓడ్డెక్క మోహన్, కాంగ్రెస్ యువజన అధ్యక్షులు గైని కిరణ్, ఆసాని అనిల్, శేఖర్, బాబు నాయక్, రామాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పుర్కాన్, తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా ప్రభుత్వం కృషి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES