- Advertisement -
మాల మహానాడు మండల అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్..
నవతెలంగాణ – తొగుట
మాల మహానాడు నాయకులను అరెస్ట్ చేయడం సరి కాదని మండల అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ జిఓ 99 సవరించాలని రాష్ట్ర మాల మహానాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిందన్నారు. ప్రభుత్వం ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసిందని ఆరోపించారు.
- Advertisement -