– అసెంబ్లీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ అచ్చంపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలు, చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలోని చెంచులు సొంతంగా ఇండ్లు నిర్మించుకోలేరు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అచ్చంపేట నియోజకవర్గం లో ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ను తెలంగాణ ప్రజా ప్రభుత్వం 3500 ఇండ్లను కేటాయించారు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అసంపూర్ణంగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని సభలో గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థించారు.
అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.ఇందిరమ్మ ఇల్లు బేస్ మెంట్ వరకు నిర్మించుకున్న వారికి డబ్బులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



