గుండు రామస్వామి.. తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట : భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షులు గుండు రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంతోపాటు పసర, చలువాయి, సోమల గడ్డ గ్రామాలలో కలిసిన ధాన్యం రాజులను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి సరైన మార్కెట్ స్థలం లేకపోవడం ద్వారా ఎక్కడపడితే అక్కడ ధాన్యాన్ని ఆరపోసుకున్నారని అన్నారు.దీంతో రైతుల ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసపోవడం జరిగిందని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో ధాన్యం కళ్ళములో పూర్తిగా తడిసి పనికి రాకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలు చేసే విషయంలో తాత్పర్యం చేయడం వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.రోజుల తరబడి ధాన్యాన్ని కళ్ళంలో ఉంచవలసి వచ్చిందని అన్నారు. మిల్లర్లు సన్నధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఒకవేళ చేసిన అనేక కొర్రీలు పెడుతున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే రైతుల ధాన్యాన్ని తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారని రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వాన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.ప్రభుత్వం ఎకరాకు 10000 రూపాయలు నష్టపరిహారం ఇస్తానని చెప్పి నేటికీ ఇవ్వలేదని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కన్నోజు సదానందం, క్యాతం సూర్యనారాయణ, కొడారి నాగరాజు, గుండు లెనిన్, నిమ్మల బిక్షం , మోటం సాంబయ్య, కట్టా వెంకటేశ్వరరావు మల్లారెడ్డి ,చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES