Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

- Advertisement -

– సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి రమేష్ బాబు..
నవతెలంగాణ – మాక్లూర్
: తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే తరుగు లేకుండా  కొనుగోలు చేయాలనీ సీపీఐ(ఎం) పరి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోనీ మామిడిపల్లి, గుత్ప, కల్లెడ గ్రామాలను సందర్శించి వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరము వ్యవసాయదారులు పండించిన పంట చేతికి రాకపోవడానికి కారణం ప్రభుత్వమే, ఒక్కొక్కరు నెలరోజులు రోడ్ల పైన ఆరబోసి ప్రభుత్వం నిర్ణయించిన తేమ వస్తదనీ ఎదురుచూస్తున్న సందర్భంగా ఇంతవరకు రాక రవాణా సౌకర్యం సకాలంలో కల్పించకపోవడం వల్ల ఈ అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యాన్ని మిల్లర్లే తీసుకొని ప్రభుత్వమే వారీకి ధైర్యం ఇవ్వాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండ గంగాధర్ మాట్లాడుతూ ..వ్యవసాయదారులకు సన్నాలు వేస్తే బోనస్ వస్తుందని ఆశతోటి అందరూ సన్నలు వేసుకోవడం జరిగిందన్నారు. సొసైటీలు కొనలేక ఐకెపిలు దగ్గరికి రాక వ్యవసాయదారులను నట్టేట ముంచినటువంటి సందర్భం ఉందని, కావున తక్షణమే తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లలతో  చర్చించి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తక్షణమే రోడ్డు మీద ఉన్న ధాన్యాన్ని గోదాంలకు పంపించాలని కోరారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సభ్యుడు కటారి రాములు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు రాజు, సుమన్, మహేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -