Monday, May 26, 2025
Homeతెలంగాణ రౌండప్తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..

- Advertisement -

బీఎస్పీ మంథని నియోజకవర్గ ఇంచార్జి రవికుమార్ 
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
: అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో  తడిసిన, రంగు మారిన,మొలకెత్తిన ప్రతి వరిగింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బిఎస్పీ మంథని నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవికుమార్,అధ్యక్షుడు బొడ్డు రాజబాబు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాటారం మండలంలోని  దేవరంపల్లి,రేగుల గూడెం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసినఎలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు ఐకెపి,పిఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో యాసంగి వడ్ల పంటను కొనుగోలు కేంద్రాలలో పోసి మ్యాచర్ వారాలు గడుస్తున్నా నిర్వాహకుల నిర్లక్ష్యంగా చేతికొచ్చిన పంట నీటిపాలైయిందని ఆవేదన వ్యక్తం చేశారు.లారీల,గన్ని సంచుల కొరతతో కొనుగోలు చేయక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయక రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నట్టుగా తెలిపారు.మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాని మొలకెత్తడంతో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.ప్రభుత్వం,ఉన్నతాధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు వేగవంతంగా కొనుగోలు చేస్తూ,నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ సీనియర్ నాయకుడు ఏట సంపత్,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -