Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేయాలి

ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేయాలి

- Advertisement -

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు చిరంజీవి
నవతెలంగాణ – కోహెడ

కుల వృత్తుల సంక్షేమంలో భాగంగా ముదిరాజులకు, మత్స్యకారులకు చెరువుల్లో పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లలు ఇంత వరకు రాకపోవడం ఆందోళనకరమని నాగసముద్రాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చిరంజీవి అన్నారు. నాగసముద్రాల గ్రామంలో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్థికంగా చితికిపోయి ఉన్న ముదిరాజులకు ప్రధానమైన వృత్తి చేపల పెంపకమని, వారి సంక్షేమం కోసం గత ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ కొనసాగించకపోవడం దారుణమని అన్నారు. ముదిరాజులు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించుకున్నారని, మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందుతున్న ఏకైక సాయం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసి ముదిరాజులకు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -