Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'23' లాంటి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

’23’ లాంటి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

- Advertisement -

‘మల్లేశం, మెట్రో 8ఏఎం’ వంటి ఆలోచనత్మక సినిమాలను రూపొందించిన దర్శకుడు రాజ్‌ రాచకొండ తెరకెక్కించిన మరో చిత్రం ’23’. నేరస్తుల పరివర్తన, నేరాలను తగ్గిస్తుందనే కథంశంతో రూపొందిన ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే గద్దర్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,’ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత, కష్టంతోనూ కూడుకున్నది. ఈ సినిమా చూశా. అది చాలా ప్రభావవంతంగా ఉంది. ఈ ప్రయత్నం చేసిన టీంని అభినందిస్తున్నాను. నేరస్తుల పరివర్తన అనే అంశాలు కథలో బాగా పొందుపరిచారు. జైలు జీవితాలను ఇంత వాస్తవికతంగా తెరమీద ఇప్పటి వరకూ చూపలేదు. ‘ది షాషాంక్‌ రిడెంప్షన్‌’ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రం ఇది. ఈ సినిమాను ఖచ్చితంగా ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం. కొందరిలో మార్పు వచ్చినా అది ఈ సినిమా సాధించిన గొప్ప విజయం. ఈ చిత్రం తెలంగాణ గద్దర్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డు పొందింనందుకు అభినందనలు’ అని అన్నారు.

దర్శకుడు రాజ్‌ మాట్లాడుతూ,’ఈ ప్రయాణంలో తోడు ఉన్న టీంకి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకం. గద్దర్‌ అవార్డ్స్‌ జ్యూరీకి థాంక్స్‌. ఈ సినిమా నిర్మించిన ప్రయోజనం నెరవేరాలంటే జైళ్ళలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ”23′ వంటి సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ‘మాభూమి, దాసి’ వంటి వాస్తవికత దృక్పధం ఉన్న సినిమాల తర్వాత ఆ పరంపర కొనసాగలేదు. ఇప్పుడు 23వంటి సినిమాలు వస్తునందుకు ఆనందంగా ఉంది’ అని దర్శకుడు బి. నర్సింగ రావు చెప్పారు.

డా.బీనా మాట్లాడుతూ, ”23” సినిమాలో జైలు రీఫార్మ్‌ ప్రోగ్రామ్‌ను చేర్చేందుకు దర్శకుడు రాజ్‌ ఎంతో పట్టుదలగా ప్రయత్నించారు. ప్రతి ఖైదీ కథ కూడా ఒక సినిమా కథలాంటిదే’ అని తెలిపారు.
‘సినిమాలు కూడా సున్నితమైన అంశాలను స్పశించగలవని రాజ్‌ నిరూపించారు. ”23” తెలుగు సినిమాల్లో ఎవరూ తాకని విషయాన్ని ధైర్యంగా ప్రస్తావించిన అరుదైన చిత్రం’ అని సిద్దోజి చెప్పారు. భరద్వాజ మాట్లాడుతూ, ‘చిలకలూరి పేట బస్సు దహనం ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కేసులో ఉన్న నిందితుల కథనే సినిమా చూపిస్తుంది. ఆ నేరం ఉద్దేశపూర్వకంగా చేయ బడింది కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసిన అనేక మంది విడుదలైనప్పటికీ, ఈ కేసులో ఉన్నవారికి ఇప్పటికీ ఉపశమనం లభించలేదు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వం, సమాజాన్ని కోరుతున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -