Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి

విద్యుత్‌ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యుత్‌ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా స్పందన లేదన్నారు. సమ్మె చేస్తున్న వారిని డిస్మిస్‌ చేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో విద్యుత్‌ కార్మికులకు టెంట్‌ వేసుకునే అవకాశం ఇవ్వలేదని అన్నారు. విద్యుత్‌ ఆర్టిజన్లను గ్రేడ్‌ల వారీగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేశారు. జెన్‌కో యాజమాన్యం విద్యుత్‌ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. వారికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -