Saturday, April 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలి

ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మండల రైతులు కోరారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారికి, జిల్లా వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురిసిన వడగండ్ల వాన వలన రైతుల మొక్కజొన్న, జొన్న పంట నష్టం వాటిల్లింది.

దాని దృష్టిలో పెట్టుకొని రెండు రోజుల క్రితం మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ సౌద్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందనీ, కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి కి వినతి పత్రం మండల వ్యవసాయ అధికారి ద్వారా మరోసారి విన్నవించడం జరిగిందనీ, రైతులు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామితో చరవాణిలో మాట్లాడుతూ మండల కేంద్రంలో చాలావరకు మొక్కజొన్న నష్టం జొన్న పంట నష్టం జరిగింది కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన చేయలేదు కావున రైతులు రేపటి వరకు ప్రభుత్వం నుండి ప్రకటన రాకుంటే ఈ నెల ఆరు తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో రైతులు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కావున ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -