రోడ్లపైనే వరి ధాన్యం మకాం రైతుల ఆవేదన
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని రోడ్లపైనే వరి ధాన్యం కాపలా మకాం రైతులంతా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కోతలు అయినవారు దాదాపు పది రోజులుగా రోడ్లపైనే ఆరబెట్టి రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉండాల్సొస్తుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల కోసం తేమశాతం లేకుండా వారం పది రోజులుగా ఎండబెట్టడం జరిగిందని తెలిపారు. పది రోజులుగా ఎండిన వాటికి ఏ ఒక్క అధికారి కూడా కొనుగోళ్ల కోసం రావడంలేదని అన్నారు. మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగినప్పటికీ కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎండలో ఉండటం, రాత్రివేళల్లో చలిలో వనకడం పరిపాటైందని అన్నారు. ధాన్యం రైతుల ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES