Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ స్కీములను ప్రభుత్వమే నిర్వహించాలి

భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ స్కీములను ప్రభుత్వమే నిర్వహించాలి

- Advertisement -

బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కార్యదర్శి టి ఉప్పలయ్య
నవతెలంగాణ – పరకాల
యునైటెడ్ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో సోమవారం జిల్లా అధ్యక్షులు తాళ్ల సారంగపాణి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యునైటెడ్ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కార్యదర్శి టి ఉప్పలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కుక్కముడి రవీందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల క్రితం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు జరుగుతున్న కార్మికుల బెనిఫిట్ స్కీములు, ఇన్సూరెన్స్ స్కీములను సహజ మరణం, ప్రమాద బీమా,పాక్షిక, శాశ్విత అంగవైకల్యం ఇన్సూరెన్స్ స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ జీవో నెంబర్ 12 ను విడుదల చేయడం జరిగింది.

 ఇది  కార్మిక వ్యతిరేక చర్య అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అన్ని జిల్లాలలో, మండలాలలో ఉన్న ఎల్ఓ, ఎసిఎల్,డిసిఎల్, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవలసిన అవసరం ఏమున్నదని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేట్ ఇన్సూరెన్స్ కాంపిణీలకు ఇవ్వడం వలన భవననిర్మాణ కార్మికులకి నష్టం జరుగుతుందని, జిల్లా కార్యదర్శి అన్నారు. కావునా ఇప్పటికైనా ఆ ఇన్సూరెన్స్ కంపిణీలకు ఇవ్వడన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడికొండ సుధాకర్, గుమ్మడి కుమార్, నాగవెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -