నవతెలంగాణ – తొగుట
దొడ్డి కొమరయ్య సేవలు మరువలేనివని చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. 1946, 1947 సంవత్సరంలో అప్పటి తెలంగాణ ప్రజలు నిజాం ఏడవ రాజు పరిపాలనలో ప్రజలందరు బానిసలుగా జీవించారని గుర్తు చేశారు. అదే సమయంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో జూలై 4వ తేదీన అక్కడి ప్రజలపైన నిజాం బలగాలు కాల్పులు జరిపిన క్రమంలో దొడ్డి కొమురయ్య వాటిని ఎదుర్కొని, నిజాం తుటాలకు బలి అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం అన్నారు. దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుండి ప్రజా శ్రేయస్సు కొరకు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. దొడ్డి కొమురయ్య తెలంగాణలోని తొలి అమరుడు అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES