ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి జబ్బర్
నవతెలంగాణ – కామరెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎం సి పి ఐ యు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీ ఐ యూ జిల్లా కార్యదర్శి జబ్బార్ నాయక్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు నానబెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత వహించి చర్చించిన తరువాత ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా కామారెడ్డి డిక్లేషన్ పైనే ఎన్నికలకు వెళ్తామనడం సరైన పద్ధతి కాదన్నారు. బీసీల పట్ల ద్వంద వైఖరి ఆవలంబిస్తూ మోసం చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో బీసీలను సమీకరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సభ్యులలు నరసింహులు, సదానందం తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వమే త్వరగా తేల్చి ఎన్నికలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES