నవతెలంగాణ – జన్నారం
వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ నిర్మల్ జిల్లా కో కన్వీనర్ రేణిగుంట్ల సాగర్ అన్నారు. మంగళవారం జన్నారం మండలం లోని ఇంధన్ పల్లి గ్రామంలో విహెచ్పిఎస్ అధ్యక్షురాలు కాల్వ సుగుణ ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు పెన్షన్లు రూ.4000 వికలాంగుల పెన్షన్లు రూ.6000 కండ నరాలతో బాధపడుతున్న వారి పెన్షన్ రూ.15000 పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంవాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికై ఈనెల 22న ఖానాపూర్ నియోజకవర్గం స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో వికలాంగులు ఆసరా పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల వికలాంగులు ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ గడిచందా ముత్యం మాదిగ పెన్షన్ దారులు పాల్గొన్నారు.
వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES