– ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్…
నవతెలంగాణ- రాయపోల్
రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 12 వేలు చెల్లించి ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్ డిమాండ్ చేశారు. శనివారం ఆటో డ్రైవర్ యూనియన్ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగా రాయపోల్ మండలంలోని ఆటో డ్రైవర్లను పోలీసులు మందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా మారిందన్నారు. ఆటోలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఫైనాన్స్ లలో అప్పులు చేసి మరి కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పుడు నెల నెల ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందన్నారు. ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టకూడదని గతంలో ఆందోళన కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి 12 వేలు చెల్లించి ఆదుకుంటామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోలకు రోడ్డు టాక్సీ రద్దు చేసిందని అలాగే బీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పరమేశ్వర్, రాములు, శ్రీనివాస్, యాదగిరి, మహేందర్, కనకయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



