Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేయూత వికలాంగుల పెన్షన్ దారులను ప్రభుత్వం ఆదుకోవాలి..

చేయూత వికలాంగుల పెన్షన్ దారులను ప్రభుత్వం ఆదుకోవాలి..

- Advertisement -

ఎమ్మెల్యే తూడి మెఘరెడ్డికి వినతి
ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ
ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాక
చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్
ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ 
నవతెలంగాణ – వనపర్తి
: చేయూత వికలాంగుల పెన్షన్ దారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ కోరారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసి వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విహెచ్పిఎస్ పట్టణ అధ్యక్షులు కుషా కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టైగర్ జంగయ్య మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పొందుపరిచిన విధంగా చేయూత పెన్షన్లు రూ.2000 నుంచి రూ.4000, వికలాంగుల పెన్షన్లు రూ.4000 నుంచి రూ.6000, కండరాల క్షీణించిన వారికి రూ.15000 పెంచుతామని హామీ ఇచ్చారని, ఈ హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్న ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణం అన్నారు. ఈ హామీల అమలు కోసం ఈనెల 20న జరిగే చేయూత, వికలాంగుల పెన్షన్ దారుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. వికలాంగుల చేయూత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సును జిల్లా నలువైపుల నుంచి పెన్షన్ దారుల వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచారు. 

ఈ సమావేశంలో వి హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంధం కృష్ణయ్య మాదిగ, వి హెచ్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు, నాయకులు గంధం చంద్రయ్య, గంధం లక్ష్మయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి పరష రాముడు మాదిగ, విష్ణు మాదిగ, ప్రవీణ్ మాదిగ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -