Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి 

తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి 

- Advertisement -
  • – లాకావత్ నరసింహ నాయక్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు
  • నవతెలంగాణ – గోవిందరావుపేట: మొంథా తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకా నరసింహా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని కర్లపల్ శివారులో రైతులతో కలిసి దెబ్బతిన్న పంట పొలాలను నరసింహ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహ నాయక్ మాట్లాడుతూ.. చేతి కాడికి వచ్చిన పంట లోటు కాడికి రాకుండా తుఫాన్ కారణంగా పోయిందని నష్టపోయిన రైతులను సర్వే చేయించి పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. వరి పంట పాలు పోసుకునే దశలో నేల వాడడం జరిగిందన్నారు. మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి పంట నష్టం సంభవించిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు ప్రారంభం కాక ధాన్యం రాశులు తడిసిపోయాయని అన్నారు.
  • గతంలో ప్రభుత్వం సర్వే చేసిన పంట నష్టపరిహారానికి డబ్బులు వచ్చాయని జమ అయ్యాయని చెప్పి ఇప్పటివరకు రైతులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈసారైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సర్వే నిర్వహించి పరిహారాన్ని అంచనా వేసి రైతులకు ప్రకాలంలో పంట నష్టపరిహారం మనదే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లేనియెడల రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ పంటల పరిశీలనలో రైతులు తేజావత్ హరి సింగ్ నాయక్ భూక్య సేవా నాయక్ భూక్య వెంకటేష్ భూక్య రాములు భూక్య రాజు నాయక్ నాగవత్ ప్రతాప్ బి దశరథ్ నాయక్  అజ్మేరా బిక్కు నాయక్ నాగవత్ లలిత లాకావత్ రాజు నాయక్ బి. సారయ్య నాయక్ వాంకుడోత్ సారయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -