Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్ల కాపరుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి...

గొర్ల కాపరుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి…

- Advertisement -

జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి..దయ్యాల నర్సింహ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో  జల్లి రాములు గొర్ల మందపై కుక్కలు దాడి చేసి 9  చనిపోగా, 10 గొర్లకు గాయాలు అయ్యాయి. కాగా సంఘటన స్థలాన్ని గొర్రెల మేకలపెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ సందర్శించి, మాట్లాడారు. గొర్రెల కాపరి జల్లి రాములు కి సంబందించిన గొర్రెలు కుక్కల దాడి తో సుమారు రూ.95 వేల రూపాయలు  ఆయనకు నష్టం జరిగిందని, ప్రభుత్వము ఈసంఘటన స్థలాన్ని పరిశీలన చేసి నష్టపరిహారం చెల్లించాలని, కుక్కలను నివారించి గొర్లకు, మేకలకు ప్రభుత్వము ఉచితంగా ఇన్సూరెన్సులు చేయించాలని కోరారు. 

ఇలాంటి సంఘటన వలన గొర్ల కాపరులు అనేకంగా నష్టపోతున్నారని ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా రోజురోజుకు ఏదో ఒకచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూడాలని నష్టపోయిన గొర్ల కాపరి కుటుంబానికి నష్టపరిహారని చెల్లించాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ  సర్పంచ్  చిందం  మల్లికార్జున, జల్లి మహేష్ , కర్రే మల్లయ్య ,కడగంచి గణేష్, కర్రే మధు, జేట్ట చేద్రమౌళి , రావులపల్లి మల్లయ్య,శివ ,పాపులు గణేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -