సర్పంచ్ మాధవి మల్లేష్
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని సర్పంచ్ మాధవి మల్లేష్ చెప్పారు. ఆదివారం మండలంలోని రాణి పేట గ్రామపంచాయతీ కార్మికులకు, డాక్టర్ శశాంక్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవి మల్లేష్ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత వైద్య క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉంటే ప్రజలుకు అంటురోగలు దరి చేరవని తెలిపారు.
గ్రామంలో పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందే విధంగా అధికారులు, ప్రజాప్రతితులు కృషి చేయాలని కోరారు. అనంతరం అన్ని గ్రామాలలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి శాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్వీన బేగం, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, ఏఎన్ఎం రాజేశ్వరి, గ్రామస్తులు జమీర్, మసూద్, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



