Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం 

పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

పేద ప్రజల ఆరోగ్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వేముల గ్రామంలో రూ.20 లక్షలతో పల్లె దావఖాన నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి పల్లె ఆస్పత్రులు ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకటయ్య, మల్లికార్జున రెడ్డి, బాల్ రెడ్డి, బంగారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చెన్నయ్య మాజీ సర్పంచ్ జంగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కృష్ణయ్య గౌడ్, నరేష్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -