నవతెలంగాణ – ధర్మసాగర్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము ప్రభుత్వ లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని విలీన గ్రామమైన ఉనికి చర్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం టిజీఎండిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి గార్లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా సాండ్ డంప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సాండ్ బజార్ లో ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరిపడా ఇసుకను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం అందరికీ రాదని, బుక్ చేసుకోకుండా వచ్చిన వారికీ సిబ్బందే ఆన్ లైన్ లో బుక్ చేసి ఇసుకను అందించాలని అన్నారు.ఇసుక కోసం వచ్చే వారికీ సిబ్బంది ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 1200 కాకుండా 1000 రూపాయలకే టన్ను ఇసుక అందించాలని జిల్లా కలెక్టర్ గారిని, టిజీఎండిసి అధికారులను కోరారు.పేద ప్రజలైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 7నుండి 8వేల రూపాయలు కేవలం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని కావున వారికీ కొంత ఆర్థిక భారం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాలలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నందున గ్రామాల్లో ఇసుక అవసరాలను గుర్తించి గ్రామాల వద్దకే ఇసుక తీసుకెల్లాడానికి మార్గాలను చూడాలని తెలిపారు. పేద ప్రజలకు సహాయం చేయాలనే దృక్పధంతో అధికారులు పని చేయాలనీ అన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 80 శాతం ఇందిరమ్మ ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయని అన్నారు.ఇది ఉమ్మడి వరంగల్జిల్లాలోనే అత్యధికం అని ఆయన తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉత్సాహంగా ఉన్నారని వారికీ కొంత ప్రోత్సాహం అందిస్తే త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, టిజీఎండిసి అధికారులు, తహసీల్దార్, ఎంపీడివో, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES