Friday, July 18, 2025
E-PAPER
Homeజిల్లాలుWomen Millionaires : మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం

Women Millionaires : మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

మంత్రి వివేక్ వెంకటస్వామి

నవతెలంగాణ – నర్సాపూర్: లక్ష మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ కళ్యాణమండపంలో ప్రభుత్వం నుంచి నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల, కళ్యాణ లక్ష్మి చెక్కులు , మహిళలకు బ్యాంకు లీకేజ్ రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.

తను మెదక్ జిల్లా ఇన్చార్జిగా ఉన్నందున సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తానని అన్నారు. అనంతరం మహిళలకు బ్యాంకు లీకేజ్ కింద 47 కోట్ల చెక్కులు, నూతనంగా మంజూరైన 2508 రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, ఆర్డిఓ మైపాల్ రెడ్డి, ఆయా మండలాల తాహశీల్దారులు ఐకెపి సిబ్బంది మహిళలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -