Sunday, March 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

- Advertisement -

 – బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్..
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
విద్యార్థులకు మెరుగైన విద్యా, వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కాండ్లీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీగోడ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జెల్కే పాండురంగ్, మోర్కండి సర్పంచ్ తొడసం నాందేవ్, కండ్లీ సర్పంచ్ అనిత రాంకిషన్ నాయక్, కళ్ళెం విఠల్, సూర్యవంశీ పండురంగ్, పాడ్వాల్ రాజు, జంగుబాపు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, యండి సద్దాం, సయ్యద్ సల్మాన్, యువజన మండల అధ్యక్షుడు కనిందే దినేష్, గవ్వల దేవేందర్, గొల్ల నాగు రమేష్, కీర్తి రమణ, తాండ్ర రమణ, సందీప్, బాల రవి, కుప్సే గణేష్, మారుతి, కిరప్ప విఠల్, దంగరి పండరి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -