Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాణ్యమైన విద్యనందించడమే సర్కారు లక్ష్యం

నాణ్యమైన విద్యనందించడమే సర్కారు లక్ష్యం

- Advertisement -

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ఘనంగా మెరీడియన్‌ వార్షికోత్సవ వేడుకలు


నవతెలంగాణ-బోడుప్పల్‌
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో పాటు మానవ విలువలు, సామాజిక చైతన్యం కలిగే విద్యను అందించేందుకు పాఠశాలలు కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం బోడుప్పల్‌ కార్పొరేషన్‌ సర్కిల్‌లోని మెరీడియన్‌ స్కూల్‌ అస్థిత్వ 4.0 పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో మంత్రితోపాటు వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రయివేట్‌ విద్యాసంస్థల స్థాయిలోనే నాణ్యమైన విద్యను పొందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.

విలువలతో కూడుకున్న విద్యను అందించడంలో మెరీడియన్‌ స్కూల్‌ యాజమాన్యం కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ డైరెక్టర్లు మాధురి, రాంగోపాల్‌ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యకలాపాలు, క్రీడలు, స్వీయరక్షణ, క్రమశిక్షణ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపాల్‌ శైలజా రెడ్డి.. తమ విద్యాసంస్థ విద్యా విధానాలను వివరించారు. కాగా, విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు చేసి ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్‌ మాజీ మేయర్‌ తోటకూర అజయ్ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ కొత్త స్రవంతి కిషోర్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -