Thursday, November 20, 2025
E-PAPER
Homeజిల్లాలురైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
జై కిసాన్ జై జవాన్ రైతులు రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. పట్టణ కేంద్రంలోని ఏఎంసీ  కార్యాలయ ఆవరణలో రూ.92.80 లక్షల వ్యయంతో కాంప్లెక్స్ నిర్మాణ కార్యక్రమాలకు మంత్రి సీతక్క తోపాటు ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంపి సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, వివిధ ప్రజా ప్రతినిధులతో కలసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మార్కెటింగ్ కమిటీ కాంప్లెక్స్‌లో 11 షాపులు, మీటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, రైతులు పండించే ప్రతీ పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు.వ్యవసాయం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, అందుకే మార్కెట్ యార్డుల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. లాంఛనంగా మంత్రి సీతక్క చేతులమీదుగా చీరల పంపిణీ కార్యక్రమన్ని మహిళలకు బొట్టు పెట్టి చీర అందించారు. మొట్ట మొదటి సారిగా కామారెడ్డి జిల్లా నుండి చీరల పంపిణీకార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల అభ్యున్నతినే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం లో భాగంగా ఈ పంపిణీ జరిగిందన్నారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళా ‘ఉక్కు మహిళ’గా ఎదగాలన్నారు. మహిళల ధైర్యం, నాయకత్వం, పట్టుదల దేశాభివృద్ధికి కీలకమని, ఇందిరాగాంధీ చూపించిన ధైర్యసాహసాలు ఈ తరం మహిళలకు మార్గదర్శకమని ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతిని పురష్కరించుకుని నవంబర్ 19 న కోటి మందికి కోటి చీరలు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.మహిళలను ఆన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారని, వారిని ఇంకా బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఆన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నదని తెలిపారు.బిక్నూరు మండల అభివృద్ధికి తనవంతుగా తోడ్పడతానని ఆన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు లింబాద్రి, నరసింహారెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, పార్టీ మహిళా మండల అధ్యక్షులు రేఖ సుదర్శన్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్డిఓ వీణ, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల నాయకులు, తదితరులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -