సర్పంచ్ ధర్మానాయక్
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామాలకు దూరంగా, అడవులలో ఉంటున్న గిరిజన మహిళ సంఘాల బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ ధర్మానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఈదుల బాయి తండా గ్రామపంచాయతీలో మహిళ సమైక్య భవనం నిర్మాణానికి వార్డు మెంబర్లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మానాయక్ మాట్లాడుతూ.. తాండాలలో మహిళా సంఘాలు బలోపేతం చేయడం కోసమే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళ సమాఖ భవనానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
మహిళలంతా ఐకమత్యంతో సంఘాలు ఏర్పడి బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. గిరిజన మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పారు. తండాలు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.



