Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రభుత్వ కక్ష సాధింపు పాలన: చల్మెడ

ప్రభుత్వ కక్ష సాధింపు పాలన: చల్మెడ

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ, మూలవాగు రెండవ వంతెన నిర్మాణాల్లో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మంగళవారం బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరులో కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, “అధికారం ఉంది కదా అని ప్రజలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, ప్రజలు కర్రు కాల్చి వాత తప్పనిసరిగా పెడతారు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నోటీసులు లేకుండానే కూల్చివేతలు
గత నెల 16న అనూహ్యంగా అధికారులు ప్రజలకు కనీసం గంట సమయమూ ఇవ్వకుండా రహదారిలోని నివాసాలు, దుకాణాలను కూల్చివేసిన ఘటనను చల్మెడ లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -