Monday, January 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపరేడ్ గ్రౌండ్‌లో జెండా ఎగురవేసిన గవర్నర్

పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఎగురవేసిన గవర్నర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఇక తెలంగాణ సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -