అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ ఖిల్లా ఘన్పూర్ మండల రైతు వేదికలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు మండల స్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నిర్దేశించిన మిల్లులకు తరలించాలని చెప్పారు. గన్నీ బ్యాగులు సరిపడునన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై డి ఎం జగన్, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES