Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలి...

ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలి…

- Advertisement -

వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల నిరసన…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లను నిర్వాహకులు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగళ్ళపల్లి మండలం చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐ కె పి కొనుగోలు కేంద్రంలో వడ్లను తూకం వేయడం లేదంటూ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా అట్ల కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్లు మ్యాచర్ వచ్చిన నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. ఎండిన వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిర్వాహకులను రైతుల నిలదీశారు. పాత గన్ని సంచులు వచ్చేవరకు కొనుగోలు చేయవద్దని అధికారులు తెలిపారన్నారు. ఇప్పటికే వర్షాల వల్ల ఆరబోసిన వడ్లన్నీ వాన నీటి కి కొట్టుకపోవడం..తో రైతులందరూ నష్టాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఐకెపి నిర్వాహకులు వడ్లను రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి తూకం వేయాలని రైతులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -