Tuesday, February 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా ఎడ్ బిడ్ మల్లన్న జాతర..

ఘనంగా ఎడ్ బిడ్ మల్లన్న జాతర..

- Advertisement -

కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్ల యోధులు
నవతెలంగాణ – ముధోల్ 

ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో గల మల్లన్న దేవుని జాతర మంగళవారం వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా నుండి కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామరెడ్డి ,మహారాష్ట్ర నుండి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్న దేవుని దర్శించుకున్నారు. కోరిన కోరికలను తీర్చాలని నిలువెత్తు బంగారాన్ని ( బెల్లం) సమర్పించారు. ఆలయంలో సాముహిక సత్యనారాయణ వ్రతాన్ని భక్తులు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో ప్రత్యేకఆకర్షణగారంగులరాట్నాలునిలిచాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానిర్వాహకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాతరలో  ఆలయ కమిటీ,గ్రామస్తుల ఆధ్వర్యంలో సుమారు లక్ష రూపాయలతో జాతరలో కుస్తీపోటీలు నిర్వహించారు.

తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం మల్లయోధులు తరలివచ్చి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. ఈ కుస్తీపోటీలు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కొనసాగాయి. వీటిని తిలకించేందుకు  భారీగా జనాలు తరలి వచ్చారు.కుస్తీపోటీల్లో పాల్గొన్నవారికి  భోజన వసతి తో పాటు పారితోషకాన్ని అందించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్త్తులకు నిర్వహకులు సుమారు 24 క్వింటాళ్ల  బియ్యం తో భారీ అన్నదానం నిర్వహించారు. ముధోల్ ఆశ్రమ పాఠశాల ఎన్ సి సి విద్యార్థులు సేవలు అందించారు. మల్లన్న దేవుని జాతర ఉత్సవాల్లో భాగంగా  ముధోల్ ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న దేవున్నీ దర్శించు కొని నిలువెత్తు బంగారాన్ని   (బెల్లం ప్రసాదం)   సమర్పించారు. 

కుస్తీ పోటీలను ప్రారంభించారు.అలాగే మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్, బిజేపి నాయకులు మోహన్ రావు పటేల్, లు మల్లన్న దేవుడు ని దర్శించుకున్నారు. వారిని  గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా  ముధోల్ సిఐ రవీందర్ నాయక్ నేతృత్వంలో ఎస్ ఐ బిట్ల పెర్సెస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. జాతరకు బైంసా నుండి ప్రత్యేక ఆర్ టీ సి బస్సు లు  నడిచాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాం చందర్ రెడ్డి,ఉప సర్పంచ్ భూమన్న,నాయకులు నిమ్మ పోతన్న,గంగా రెడ్డి,సాయం రెడ్డి, విట్ఠల్ రెడ్డి,, రవీందర్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్ ,రాములు, ,లక్ష్మన్,ఉదయ్,సుదర్శన్, విట్ఠల్ యాదవ్ ,ఆలయ నిర్వాహకులు,గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -