- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
అనారోగ్యంతో మృతి చెందిన తాతకు తన మనవడు తలకొరివి పెట్టిన సంఘటన పెద్దవూర మండలంలోని నాయినవానికుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కత్తి రాం రెడ్డి (70) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. అతనికి ఒక్కగానొక్క కుమారుడు కత్తి రావిపాల్ రెడ్డి 08 ఎండ్ల క్రితం మృతి చెందాడు. కత్తి రాంరెడ్డికి భార్య, కోడలు, కూతురు, అల్లుడు ఉన్నారు. కొడుకు మృతి చెందడంతో రాంరెడ్డికి మనవడు రామాంజి రెడ్డితో తలకొరివి పెట్టించారు. 05 ఏండ్లు వయసులోనే తండ్రి మృతి చెందారు. ఇప్పుడు 13 ఏండ్లు వయస్సులో తాతను కూడా మృతి చెందడంతో తాతకు మనవడు తలకొరివి పెట్టడాన్ని చూసిన ప్రజలు కన్నీరుమున్నీరుగా రోదించారు.
- Advertisement -