Friday, October 10, 2025
E-PAPER
Homeఆటలుకొత్త పీఈటీ పోస్టుల మంజూరు హర్షణీయం

కొత్త పీఈటీ పోస్టుల మంజూరు హర్షణీయం

- Advertisement -

హైదరాబాద్‌ : పాఠశాల స్థాయిలోనే క్రీడాభివద్ది, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపుదలకు నూతనంగా 1803 వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ) పోస్టులను మంజూరు చేయటం హర్షణీయమని వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం (పెటా టిఎస్‌) రాష్ట్ర కార్యవర్గం తెలిపింది. కొత్త పోస్టుల మంజూరు దస్త్రాన్ని ఆర్థిక శాఖ ఆమోదానికి పంపిన సందర్భంగా పాఠశాల విద్య కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌ను గురువారం ఆయన కార్యాలయంలో కలిసి పెటా టిఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్‌ సహా కోశాధికారి శక్రు నాయక్‌లు ధన్యవాదాలు తెలిపారు. పెటా టిఎస్‌ జిల్లా ఆఫీస్‌బేరర్లు కట్ట శ్రీనివాస్‌, సోలీపురం వెంకటరెడ్డి, దినేశ్‌ కుమార్‌, విక్రమ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -