– ప్రొఫెసర్ ఐ.తిరుమలి
– ఎస్వీకేలో ‘హైదరాబాద్ విలీన దినోత్సవ’ సభ
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచంలో గొప్ప చరిత్ర ఉందని ప్రొఫెసర్ ఐ.తిరుమలి అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం ‘హైదరాబాద్ విలీన దినోత్సవ’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నైజాం పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. రజాకారుల ఆగడాలను భరించలేని ప్రజలు సాయుధ పోరాటం చేశారని తెలిపారు. చివరికి సెప్టెంబర్ 17న నిజాం తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేసినట్టు చెప్పారు. ఎస్‌వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే నాటకాన్ని త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి గొప్ప చరిత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES