Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅపర దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్‌

అపర దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్‌

- Advertisement -

మహ్మద్‌ అబ్బాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అపర దేశభక్తుడు అష్పాఖుల్లా ఖాన్‌ అని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అబ్బాస్‌ కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిరక్షణ కోసం పోరాటం చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం షహీద్‌ అష్ఫాఖుల్లా ఖాన్‌ 98వ వర్ధంతి సభను ఆవాజ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆవాజ్‌ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి మహ్మద్‌ అలీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అబ్బాస్‌ మాట్లాడుతూ అష్ఫాఖుల్లా ఖాన్‌ ఉరిశిక్ష అమలు జరుగుతున్న రోజున తన త్యాగం మరెందరో త్యాగధనులకు స్ఫూర్తిని స్తుందనీ, దేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం కలుగుతుందనీ, అందుకోసం తనకు ఉరిశిక్ష విధించినా అదష్టవంతునిగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారని అబ్బాస్‌ గుర్తుచేశారు. రాంప్రసాద్‌ బిస్మిల్‌తో కలిసి హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో పని చేసిన ఆయనను కకోరి కుట్ర కేసులో 1927 డిసెంబర్‌ 19న ఉరి తీశారని తెలిపారు. మతోన్మాదం దేశ సమైక్యతకు, సమగ్రతకు సవాళ్లు విసురుతున్న తరుణంలో అష్ఫా ఖుల్లా ఖాన్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ల ఐక్య పోరాటం యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. సామ్రాజ్య వాదాన్ని పారదో ల డానికి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా ఎలా పోరాటం చేశారో అదే స్ఫూర్తితో నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిం చాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, షేక్‌ అబ్దుల్‌ ఇలియాజ్‌, బాలకష్ణ, మీర్‌ అబిద్‌ అలీ, షేక్‌ అబ్దుల్‌ తన్వీర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -