Sunday, November 9, 2025
E-PAPER
Homeసినిమా'ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో'కి విశేష ప్రేక్షకాదరణ

‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’కి విశేష ప్రేక్షకాదరణ

- Advertisement -

‘టీఎఫ్‌జేఏ’కి ఆర్థిక విరాళం ప్రకటించిన నిర్మాత సందీప్‌ అగరం
తిరువీర్‌, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం చిత్రం ‘ది గ్రేట్‌ ప్రీ-వెడ్డింగ్‌ షో’.
సందీప్‌ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎం ప్రొడక్షన్స్‌, పప్పెట్‌ షో ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై నిర్మించారు. రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు.
కల్పనా రావు సహ నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో శనివారం బ్లాక్‌ బస్టర్‌ ఫన్‌ షోని చిత్రయూనిట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్‌ రవి మాట్లాడుతూ, ‘సినిమాకు వెళ్లినట్టుగా కాకుండా.. ఊర్లోకి వెళ్లినట్టు చూసినట్టుగా ఈ సినిమా ఉంటుంది. ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్‌ ఇచ్చిన చిత్రమిదే. ఈ మూవీకి చాలా అవార్డులు వస్తాయి. ఇది మీడియాకు నచ్చిన చిత్రం.. మీడియాకు నచ్చిందంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని అర్థం’ అని అన్నారు.
‘ఈ చిత్రం కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. రోహన్‌ అయితే మా కోసం ఇన్‌ స్టాలో ఎక్కువగా ప్రమోట్‌ చేశాడు. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్‌ కామెంట్‌ కనిపించలేదు. మౌత్‌ టాక్‌, మౌత్‌ పబ్లిసిటీతోనే నా సినిమాలు ఆడుతుంటాయి. ఇప్పుడిప్పుడే మా సినిమా పికప్‌ అవుతోంది’ అని హీరో తిరువీర్‌ చెప్పారు. దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘మీడియా లేకపోతే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు. ఒక్క నెగెటివ్‌ రివ్యూ, కామెంట్‌ లేకుండా అందరూ ప్రశంసిస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని తన శిష్యుడికి ఇచ్చిన నా గురువు గురు కిరణ్‌కి థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లు గంట సేపు మాట్లాడారు. మీడియా వల్లే మా మూవీ ఆడియెన్స్‌ వరకు రీచ్‌ అయింది. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టీఎఫ్‌జేఏ)కి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నాను. మంచి చిత్రాన్ని నిర్మించావని నా సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులంతా మెచ్చుకుంటున్నారు’ అని నిర్మాత సందీప్‌ అగరం చెప్పారు.హీరోయిన్‌ టీనా శ్రావ్య, నటి యామిని, నటుడు నరేంద్ర రవి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, మాస్టర్‌ రోహన్‌, ఎడిటర్‌ నరేష్‌, సౌండ్‌ డిజైనర్‌ అశ్విన్‌, నటుడు జోగా రావు, లిరిసిస్ట్‌ సనారే తదితరులు ఈ చిత్ర విజయం పట్ల తమ ఆనందాన్ని, అనుభూతుల్ని పంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -