Wednesday, October 29, 2025
E-PAPER
Homeసినిమామంచి కంటెంట్‌తో 'ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో'

మంచి కంటెంట్‌తో ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’

- Advertisement -

తిరువీర్‌, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’. బై 7పీఎం, పప్పెట్‌ షో ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్‌ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాత. నవంబర్‌ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. మంగళవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్‌, యదు వంశీ, ఆదిత్య హాసన్‌, రామ్‌ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్‌, ఉదయ్ గుర్రాల, రూపక్‌, తేజ, నంద కిషోర్‌ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో తిరువీర్‌ మాట్లాడుతూ, ‘నిర్మాత సందీప్‌ మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. మంచి కంటెంట్‌తో మా సినిమా రాబోతోంది. ఇది అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.

‘మా హీరో తిరువీర్‌ ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. దర్శకుడు రాహుల్‌ ఈ మూవీని అద్భుతంగా తీశారు’ అని నిర్మాత సందీప్‌ అగరం చెప్పారు. దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌లో హీరో తిరువీర్‌. మా ట్రైలర్‌ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్‌ చేసేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు. ‘మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్‌ ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మంచి కంటెంట్‌తో మంచి ఎంటర్టైన్మెంట్‌ ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది’ అని హీరోయిన్‌ టీనా శ్రావ్య అన్నారు. మాస్టర్‌ రోహన్‌, సురేష్‌ బొబ్బిలి, నటి యామిని, నటుడు నరేంద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -