– సంక్రాంతి వేళ పెరిగిన రద్దీ
నవతెలంగాణ-వైరా
హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతి పండుల వేళ పెరిగిన వాహనాల రద్దీకి ఈ హైవే అందుబాటులోకి రావడంతో కొంత ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. హైదరాబాద్ నుంచి వచ్చే వారు సూర్యాపేట వద్ద ఖమ్మం రోడ్డులోకి ప్రవేశించి, ఖమ్మం నగరంలోని అల్లిపురం దాటాక ర్యాంపు ద్వారా హైవే ఎక్కొచ్చు. వైరా, బోనకల్లు వెళ్లేవారు.. సోమవరం గ్రామంలోని ఎగ్జిట్ వద్ద దిగి వెళ్లొచ్చు. అదే విధంగా కల్లూరు మండలం వెళ్లేవారు లింగాల వద్ద, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే వారు తమ్మిడికుంట వద్ద, సత్తుపల్లి మండలం వారు రేజర్ల ఎగ్జిట్‌ల వద్ద దిగొచ్చు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఎగ్జిట్‌ల మీదుగా నేరుగా ఏపీకి చేరుకోవచ్చు. సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి భారీగా జనం తరలివెళ్తున్న నేపథ్యంలో.. సూర్యాపేట మీదుగా రహదారిపై రద్దీ పెరగడంతో అక్కడి పోలీసులు ఖమ్మం మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. పలు చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు, మూడు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. గతం కంటే ప్రయాణం సుఖవంతం, మైళ్ల దూరం తగ్గి ప్రయాణ ఖర్చులు కూడా తగ్గనున్నవి.
అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ హైవే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



