Monday, December 15, 2025
E-PAPER

చలి పంజా

- Advertisement -

మూడు నుంచి నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత
ఎల్లో అలర్ట్‌ జారీ..బెంబేలెత్తుతున్న జనం..
ఆరోగ్యరక్షణ చర్యలు అవసరం : వైద్యులు

హైదరాబాద్‌ : తెలంగాణ చలికి వణకుతోంది. దీనికి తోడు ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలు లు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆది, సోమవారాల్లో కనిష్ట ఉషోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది

బెంబేలెత్తుతున్న జనాలు
గత కొద్ది రోజులుగా వరసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారుల్లో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వ ృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు బారడం, కండ్ల నుంచి నీళ్లు రావడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా ఉంటుంది. అనేక జిల్లాల్లో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా వాహనచోదకులకు కనిపించడం లేదు.ఉదయాన్నే రోడ్లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారు చలికి తట్టుకోలేక కాగితాలు,లేదా చెక్కముక్కలు వేసి నిప్పు కాచుకుని సేదదీరుతున్నారు. చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

చలి నుంచి రక్షణ అవసరం
ఎలర్జీ సమస్యలున్న వారు చెవులు, ముక్కు, నోటి ద్వారా చల్లగాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు బయటకు వెళ్లేటప్పుడు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే వస్త్రాలను ధరించడం మంచిదని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -