- Advertisement -
నవతెలంగాణ – భైంసా:
గురువే సమాజానికి మార్గదర్శి అని భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి అన్నారు. మండలంలోని దేగాం జడ్. పి. హైస్కూల్ లో గురుపూర్ణిమను పురస్కరించుకొని మహిళ మోర్చా ఆధ్వర్యంలో మహిళ టీచర్లను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా గురువులను విస్మరించవద్దన్నారు. కార్యక్రమంలో జడ్. పి హైస్కూల్ టీచర్లు, ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు, యోగా టీచర్లు, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -