Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేతికి వచ్చిన పంట వర్షార్పణం..

చేతికి వచ్చిన పంట వర్షార్పణం..

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలో ఈ ఏడాది అత్యధికంగా రైతులు సోయా పంట సాగు చేశారు. సోయా పంట చేతికి వచ్చింది జోరు వానలు వదలకుండా కొరియడంతో చేతికి వచ్చిన పంట వర్షార్పణం అవుతుంది. సోయా పంట నేలపాలై మొలకెత్తుతుండడంతో రైతన్నల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది భారీ వర్షాల కారణంగా మొలికెత్తుతున్న సోయా పంటను రైతులు ఆదివారం నాడు రైతు వేదికకు తరలివచ్చి మొలకెత్తిన సోయా పంటను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోయా పంట మంచి దిగుబడి వస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల పంట వచ్చేదని ఈ ఏడాది పంట బాగుందని ఆశించిన రైతన్నకు నిరాశ చెందవలసి వస్తుంది. ఎందుకంటే ఎడతేర్పు లేకుండా కురుస్తున్న వర్షానికి కోతకు వచ్చిన పంట చేతికి రాకుండా నేలపాలై మొలకెత్తుతుండడంతో పంట దిగుబడి చేతికి రాకుండా భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని సోయా పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కోతకు వచ్చిన పంట వర్షార్పణం అవుతుంది. భారీ వర్షాలతో ఈ ఏడాది నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -