Thursday, July 17, 2025
E-PAPER
Homeకరీంనగర్పంట కార్తెలు ముగుస్తున్న...కరుణించని వరుణుడు

పంట కార్తెలు ముగుస్తున్న…కరుణించని వరుణుడు

- Advertisement -


వెల వెల బోతున్న సాగునీటి వనరులు
గడ్డు పరిస్థితుల్లో రైతన్న
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల

పంట కార్తెలు ఒక్కొక్కటి ముగుస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు లోటు వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సాగుకు చేటుగా మారే దుస్థితి తలెత్తింది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలమట్టాలు పాతాళంలోనే ఉండిపోతున్నాయి భూమి అంతర్భాగం లోని పొరల్లో నీటి వృద్ధి లేక ప్రధాన పంటలైన వరి సాగుకు తీవ్ర ఆటంకం కలుగుతుంది పత్తి మొక్కజొన్న తదితర పంటల సాగు సైతం ముందుకు సాగడం లేదు వర్షాల కోసం అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.
మెట్ట ప్రాంతమైన జిల్లాలో సరైన వర్షాలు లేక సాగునీటి వనరులు వెలవెలబోతున్నాయి రైతాంగానికి చాలీచాలని వర్షాలతో ఈ ఏడాది ఊరట లభించడం లేదు భూగర్భ జలమట్టాలు నానాటికి తీసికట్టుగా మరింత లోతున చేరుకుంటుండడంతో మరోవైపు బోర్లు, బావుల్లో నీటి చుక్క కనిపించడం లేదు వరునుడి కరుణను నమ్ముకుని పంటలను సాగు చేసి అదును కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. భిన్నమైన వాతావరణం పరిస్థితులతో ఖరీఫ్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.సమృద్ధిగా వర్షాలు లేక సాగుపై సందిగ్ధత నెలకుంది కొన్ని ప్రాంతాల్లో రైతులు దుక్కులు సిద్ధం చేసిన ఆరుతడి పంటల విత్తనాలు విత్తటానికి వెనకంజ వేస్తున్నారు. ప్రధానంగా వరి నారు పోసే ప్రక్రియ వెనుకబడిపోతుంది .జిల్లాలో పంటల సాగు అంచనా 91566 హెక్టార్లు ఉండగా భారీ వర్షాలు భూగర్భ జల మట్టాలు పెరుగుదలపైనే సాగుబడి ఆధారపడి ఉంది.



ఆశించిన స్థాయిలో వానలు లేక సాగునీటి వనరులు వెలవెలబోతున్నాయి మొన్నటి ఏసంగిలో వేసిన పంటలు నీరు లేక ఎండిపోయాయి జిల్లాలో భూగర్భ జల మట్టాలు అడుగంటిపోయి ప్రమాద కటికలు మోగిస్తున్నాయి గతేడాది మే మాసంలో భూగర్భ జలాలు జిల్లా సగటున 14.18 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది 17.78 మీటర్ల లోతులోకి చేరాయి. ఈ సంవత్సరం మే మాసంలో వేములవాడలో 27.40 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. 25.47 మీటర్ల లోతుతో ఎల్లారెడ్డిపేట మండలం ఉండగా 24.65 మీటర్ల లోతుతో ముస్తాబాద్ మండలం ఉంది. భారీ వర్షాలతో భూగర్భ జల మట్టాల పెరుగుదల పైనే అన్నదాతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పూర్తిగా మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ లో 91566 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నార్లు పోసి వరి నాట్లకు సిద్ధం కావాల్సి ఉండగా సాగునీటి లేమితో ఆలస్యం అవుతున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నేలతడవగా దుక్కులు దున్నుకున్నారు. వర్షాలపై ఆశలు పెట్టుకుని వరి నారులు పోస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే పత్తి, మొక్కజొన్న తదితర వర్షాధార పంటలు వేయనున్నారు. భూగర్భ జలమట్టాలు వృద్ధి పైనే వరినట్లు వేసే ప్రక్రియ ఆధారపడి ఉంది.

అంచనా దాటేనా…?


మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోర్లు బావుల పైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. చెరువులు కుంటల్లోకి కొత్తగా నీరు చేరకపోగా భూగర్భ జలం మట్టాలు పాతాళానికి పడిపోవడం రైతుల పాలిట శాపం గా మారింది. సాగునీటి కొరతతో యాసంగిలో పంటలు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందివందల ఎకరాల విస్తీర్ణంలో పంటలు నిలువునా ఎండిపోయాయి. పంటల సాగు వంచనాకు అనుగుణంగా అందుకు కావాల్సిన విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు సమకూర్చుతున్నారు. లోటు వర్షాల కారణంగా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు, కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి జలాశయాల్లో నీరు చేరకపోవడంతో ఆందోళన నెలకొంది.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్నపాటి కుంటలు, చెరువులు మొదలుకొని మధ్యతరగహ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం మూలంగా ఈ ఏడాది భారీ వర్షాల పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు ఉండడంతో ఖరీఫ్ సాగుపై రైతులు పెట్టుకున్న ఆశలు తేలిపోతున్నాయి. 91566 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశం కనిపిస్తుంది.

25119 హెక్టార్లలో వరి, 56703 హెక్టార్లలో పత్తి, 3590 హెక్టార్లలో మొక్కజొన్న పంటలను సాగు చేయనున్నారు. జిల్లాలో గతంలో లాగే వాణిజ్య పంట పత్తి సాగుపైనే రైతుల ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయనున్నారు. ఇంకా గతేడాది పత్తి సాగు చేసిన రైతులు వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం వానలు కురిసే అదును కోసం వేచి చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -