Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

- Advertisement -

– దీన్ని ఉపసంహరించాలని డిమాండ్‌
– కేంద్రంలో, రాష్ట్రంలో నిర్బంధం ఉంటే ఎలా? : అసెంబ్లీలో కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుతో ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు విమర్శిం చారు. ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాల్సిన అవసరం లేదనీ, ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగాలు, ద్వేషపూరితమైన నేరాలను నివారించు బిల్లు-2026ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టారు. డిజిటల్‌, సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత ప్రసంగాల వ్యాప్తి కారణంగా శాంతి, సామాజిక సామరస్యానికి హాని కలుగు తోందని చెప్పారు. సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీన పరుస్తున్నదని అన్నారు. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయటంతోపాటు బాధితులకు తగిన పరిహారం అందజేయాల్సిన ఆవశ్యకత ఉంద న్నారు. సమాజంలో ద్వేషం, విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగం, ద్వేషపూరిత నేరాల వ్యాప్తి, ప్రచురణ, ప్రోత్సా హాన్ని నివారించేందుకు ఈ బిల్లును తెస్తున్నా మని అన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకి స్తున్నానని చెప్పారు. విద్వేష ప్రసంగాలను కట్టడి చేయడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం సరిపోతుందని అన్నారు. కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు ఈ బిల్లు తో ఇబ్బంది పడతారని చెప్పారు. కేంద్రంలో ప్రజాస్వామ్యం నిర్బంధంలో ఉందనీ, రాష్ట్రంలో కూడా అలాగే ఉంటే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఉపా చట్టం కింద వరవరరావు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్‌ఐఏ కింద ఎప్పుడైనా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని అన్నారు. అల్లా, రాముడు, జీసస్‌ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే విద్వేష ప్రసంగా ల నిరోధక బిల్లు కింద కేసును నమోదు చేయొచ్చని చెప్పారు. వాట్సాప్‌లో సమాచార మార్పిడి చేసినా కేసు పెట్టొచ్చని అన్నారు. తమ పార్టీలో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా పార్టీ మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుం దనీ, రాష్ట్ర కార్యదర్శిగా తనపై కూడా కేసు నమోదు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులుండ బోవని బిల్లులో ఉందన్నారు. ప్రస్తుతానికి ఉన్న చట్టమే సరిపోతుందన్నారు.

సెలెక్ట్‌ కమిటీకి పంపాలి
ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కాంగ్రెస్‌ సభ్యులు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, మట్టా రాగమయి, ఎంఐఎం సభ్యులు అహ్మద్‌ బిన్‌ అబ్దులా బలాల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లౌకికత్వాన్ని కాపాడాలనీ, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. కుల, మత, ప్రాంతం పరమైన విద్వేషాలను రెచ్చ గొట్టకుండా కట్టడి చేయాలని సూచించారు.

ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకే ఈ బిల్లు మహేశ్వర్‌రెడ్డి
శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. మానవహక్కులను ఉల్లంఘించేలా ఈ బిల్లు ఉందనీ, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని అన్నారు. బిల్లులో పలు సెక్షన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరారు. మీడియాలో ప్రశ్నిస్తే ఆ వ్యక్తిని వేధించే అవకాశముందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయి వంటి చనిపోయిన వారి గురించి ప్రస్తావించినా, నిజాం పాలనను వ్యతిరేకించినా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసే అవకాశముందని చెప్పారు. పోలీసులకు అధికారాలివ్వడం సరైంది కాదన్నారు. సామాన్యులకు సంకెళ్లు వేసి ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చట్టాలు ప్రజలకు రక్షణగా ఉండాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -