Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుసాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి 

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు ) సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో(చాకలి) చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి వనపర్తి అంబేద్కర్ చౌక్ అమరవీరుల స్తూపం దగ్గర బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ సీపీఐ(ఎం) జెండాను ఎగరవేశారు. అనంతరం సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కార్యదర్శి ఎం. పరమేశ్వర ఆచారి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ పాల్గొని ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్- బిజెపి హిందూ ముస్లిం కొట్లాటగా వక్రీకరించి చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. చరిత్ర కు వక్రభాష్యాలు చెప్పడం అబద్ధాలను ప్రచారం చేయడం బిజెపికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. చిట్యాల ఐలమ్మ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలని ఆమె నిజాం రాజు పరిపాలనలో విసునూరు దేశముకు రామచంద్ర రెడ్డి హిందూ భూస్వానికి వ్యతిరేకంగా తన భూమి రక్షణ కోసం సమరశీలంగా పోరాడారని కొనియాడారు. కొండలరావు దగ్గర భూమి కవులకు తీసుకొని భూమి సాగు చేసుకుంటున్నా ఐలమ్మ భూమిపై విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి భూస్వామి కి కన్ను పడిందన్నారు. దేశముక్ రామచంద్ర రెడ్డి గూండాలను పంపి ఆమె పొలంలో పంటను కోసుకుపోవడానికి ప్రయత్నించగా కమ్యూనిస్టు నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో తిరుగుబాటు చేసి గుండాలను తరిమికొట్టి, ఐలమ్మ పంటను కోసి నూర్పిడి చేసి ఐలమ్మ ఇంట్లో వేశారు.

అదే రాత్రి ధాన్యాన్ని తీసుకుపోవడానికి గుండాలను పంపారు. ఐలమ్మ ఇంటి పైకి వచ్చిన అట్టి గుండాలను కమ్యూనిస్టులు వారిపై దాడి చేసి తరిమి కొట్టారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయన సహచరులను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి నోట్లో మూత్రం పోసి తీవ్ర ఇబ్బంది పెట్టారన్నారు. అనేక రకాల చిత్రహింసలకు గురిచేసిన పోరాటం ఆగలేదన్నారు. ఐలమ్మ భర్తను, కుమారులను జైలుకు పంపిన ఆమె పోరాటం ఉధృతంగా సాగించింది, తప్ప వెనక్కి పోలేదన్నారు.  ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం హిందూ- ముస్లింల పోరాటం కాదన్నారు. ముస్లిం బందగి నీ ఆ కాలంలో పోరాటం చేస్తున్న అతన్ని చంపారు. సోయాబుల్లాఖాను రచయిత పైన దాడి చేసి అతన్ని చంపారు. హిందువులు – ముస్లింలు అనే తేడా లేకుండా భూస్వామ్య గుండాలు ,రాజు ప్రైవేటు సైన్యం రజాకార్లు నాలుగువేల మందిని హత్యగావించారు.

23 రకాల పన్నులు వేసి చిత్రహింసలకు గురి చేసేవారు. స్త్రీలను మానభంగాలు చేసేవారు. అనేక రకాల దోపిడీ కి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నీ బాంచన్, నీ కాల్ముక్త అనేవాళ్ళు తుపాకులు పట్టి ముస్లిం నిజాం రాజు , రజాకార్లను హిందూ భూస్వాములు, దొరలను ఓడించారు. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించారు. భూస్వాములను తరిమికొట్టారు. 10 లక్షల ఎకరాల భూములు పంచుకున్నారు. అంటరానితనాన్ని అంతం చేశారు. స్త్రీ- పురుష తేడా లేకుండా కలిసి జీవించారు. హిందూ- ముస్లిం తేడా లేకుండా ఉద్యమించారు. చిట్యాల ఐలమ్మ ఆశయాలు కొనసాగించడం అంటే భూ పోరాటాన్ని కొనసాగించాలన్నారు. దున్నేవానికి భూమి కోసం ఉద్యమించాలన్నారు.

కుల అంతరాలకు వ్యతిరేకంగా, అంటరాని తనానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్- బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదులకు, ముస్లిం మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. మతం పేరుతో వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించడానికి వ్యతిరేకంగా ఉద్యమించడమే ఐలమ్మ కి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. లక్ష్మి, ఎం. రాజు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పట్టణ కమిటీ సభ్యులు డి. కురుమయ్య, పట్టణ కమిటీ సభ్యులు జి. బాలస్వామి, గంధం మదన్, జి. గట్టయ్య , ఎ.రమేష్, బీసన్న నాయకులు జి .రాబర్ట్, నందిమల్ల రాములు, ఉమా ,సాయి లీల, ఎం. మన్యం, రత్నయ్య, జి. భాస్కర్, బి. కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad