Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పై పిటిషన్‌ స్టేకు నిరాకరించిన హైకోర్టు

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పై పిటిషన్‌ స్టేకు నిరాకరించిన హైకోర్టు

- Advertisement -


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనే పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిందనీ, రిజర్వేషన్ల వ్యవహారం తేలేవరకు స్టే ఇవ్వాలని అడ్వొకేట్‌ పుట్టా పద్మారావు వేసిన పిటిషన్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. బార్‌ కౌన్సిల్‌ వాదనల తర్వాతే స్టే ఆదేశాలపై తగిన నిర్ణయం తీసుకుంటామని చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. బార్‌కౌన్సిల్‌ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందనీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ వాదన. విచారణ ఈనెల 29కి వాయిదా పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -