Thursday, December 25, 2025
E-PAPER
Homeబీజినెస్హిల్ట్‌ పాలసీని పునసమీక్షించాలి

హిల్ట్‌ పాలసీని పునసమీక్షించాలి

- Advertisement -

జీఓ నెం.27లో స్పష్టత కరువు : పారిశ్రామిక వర్గాలు
నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో

హైదరాబాద్‌ ఇండిస్టీయల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌)పై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పాలసీ గందరగోళంగా ఉందని.. దీనిపై పారిశ్రామికవేత్తలతో కలిసి చర్చించి పున:సమీక్షించాలని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌ రాయితీలపైనా స్పష్టత ఇవ్వాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్‌ ఆర్‌ రవి కుమార్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె మహేశ్వరి, టీఐఎఫ్‌ ప్రెసిడెంట్‌ కె సుధీర్‌ రెడ్డి, చర్లపల్లి ఇండిస్టీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస రెడ్డి, ఐఏఎల్‌ఏ చైర్మెన్‌ స్వామి గౌడ్‌, ఎఫ్‌ఈటీఎస్‌ఐఏ ప్రెసిడెంట్‌ రాజమహేంద్ర రెడ్డి, టీఐఎస్‌ఎంఏకు చెందిన అనిల్‌ అగర్వాల్‌, ప్రకాశ్‌ గొయాంక, టీఎస్‌ఓఏడీఏ జనరల్‌ సెక్రటరీ వెంకట్‌ ఎన్‌ఎన్‌కే పాల్గొన్నారు. ఈ పారిశ్రామిక సంఘాలు దాదాపు 50వేల పైగా పరిశ్రమలకు ప్రాతినిద్యం వహిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్‌కు విఘాతం కలిగించేలా ఉన్న కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించాలన్నారు. డిస్కంల తప్పుడు విధానాలు, పెనాల్టీల వల్ల పరిశ్రమల విద్యుత్‌ బిల్లులు అకస్మాత్తుగా 3 నుంచి 5 రెట్లు పెరిగాయన్నారు. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన నోఅబ్జెక్షన్‌ సర్టిఫికేట్లు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పరిశ్రమలు విద్యుత్‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకో వడానికి ఇచ్చే రాయితీలపై స్పష్టత కావాలని కోరారు. జీఓ నెంబర్‌ 27, పరిశ్రమల తరలింపునకు సంబంధించిన ఇండిస్టియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) గందరగోళంగా ఉందన్నారు.
ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ఉన్న పరిశ్రమలను తరలించాలనే ప్రతిపాదనలో స్పష్టత లేదన్నారు. తరలింపునకు అయ్యే ఖర్చు, ప్రత్యామ్నాయ స్థలాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మౌనంగా ఉందని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల తరలింపు అనేది ఇండ్లను మార్చినంత సులభం కాదని, దీనికి ఏండ్ల తరబడి ప్రణాళిక అవసరమని వారు స్పష్టం చేశారు. ఈ జీఓను తాత్కాలికంగా నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా తీసుకోకుండా, పారిశ్రామిక సంఘాలతో చర్చలు జరిపి విధానాలను రూపొందించాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -