సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ చరిత్ర అంటే అది భారత ప్రజాస్వామ్య చరిత్రే అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో సేవ, అంకితభావం, నైతికత, విలువలు ఉన్నాయని పేర్కొన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలోనే, తెలంగాణ మారుమూల గ్రామం నుంచి కెరీర్ ప్రారంభించిన పీవీ.నర్సింహారావు ప్రధానమంత్రి అయ్యారనీ, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి రాజ్యాంగ రూపకల్పన వరకు ప్రజాస్వామ వ్యవస్థ నిర్మాణం నుంచి వైవిధ్య భారతదేశాన్ని ఐక్యంగా నిలపడం వరకు ఆధునిక భారతదేశం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతి దాన్ని నిర్వచించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ చరిత్రే భారత ప్రజాస్వామ్య చరిత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



