న్యూఢిల్లీ : గతంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు 9.44శాతం కేటాయిం పులు పెరిగాయి. ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో హోంశాఖకు రూ.2,55,233.53 కోట్లు కేటా యించారు. గతేడాది ఇది రూ. 2,33,210 కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి రూ. 6,782 కోట్లు అంచనా వ్యయంగా కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.2,623 కోట్లు పెరిగింది. అంతర్గత ముప్పులు, ఉగ్రవాద కార్యక్రమాలు, భద్రతా ప్రమాదాలపై సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి జాతీయ భద్రత కాపాడ్డంలో కీలకమైన ఐబీ అవసరాలు తీర్చడానికి ఈ కేటాయింపులు జరిపినట్లు బడ్జెట్ పత్రం పేర్కొంది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్వంలో జరిగే జనగణన 2027కు రూ.6వేల కోట్లు కేటా యించారు. జనగణనలో మొదటి దశ గృహాల జాబితా, గృహ గణన (హెచ్‌ఎల్‌ఓ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ కొనసాగుతుంది. రెండోదశ జనగణన వచ్చేడాది 2027 ఫిబ్రవరి-మార్చి వరకు నిర్వహిస్తారు. గతేడాది డిసెంబరు 12న కేంద్ర క్యేబినెట్ జనగణన కార్యకలాపాలకోసం రూ.11,718.24 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపింది. స్వతంత్ర భారతం లో తొలిసారిగా డిజిటల్ జనగణనను నిర్వహించను న్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ జనగణనలో దాదాపు 31 సిబ్బంది వీరిలో ఎక్కువ మంది పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ 25 వేల గౌరవ వేతనం అందచేయనున్నారు.
అలాగే, ఈ ఏడాది బడ్జెట్‌లో వైబ్రంట్ విలేజస్ ప్రోగ్రామ్ (వీవీపీ) రెండోదశకు రూ.300కోట్లు కేటాయిం చారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న వ్యూహా త్మక గ్రామాల సమగ్రాభివృద్ధికి ఈ వీవీపీని రూపొందించారు.
సీఏపీఎఫ్ కోసం….
కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్) కోసం ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 5,040 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది రూ.4,038 కోట్లుగా ఉంది. సీఆర్ పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లతో కూడిన సిఎపిఎఫ్‌కు ఈ బడ్జెట్‌లో రూ 1,73,802.53 కోట్లు కేటాయించారు. రాష్ట్ర పోలీసు దళాలు, నేర క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ వ్యవస్థల (సిసిటిఎన్‌ఎస్) ఆధునీకరణ కోసం రూ. 450.54 కోట్లు కేటాయించారు. భద్రతా పరమైన వ్యయాలు (ఎస్‌ఆర్‌ఇ), వామపక్ష తీవ్రవాద (ఎల్‌డబ్ల్యూ ఈ) ప్రాంతాల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కోసం రూ. 3,610.80 కోట్లు కేటాయించారు. మార్చి 31 లోపు దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ కేటాయింపులు జరగడం గమనార్హం.
పోలీసులు, కోర్టులు, ప్రాజిక్యూషన్, జైళ్లు, ఫోరెన్సిక్ ఏజెన్సీల మధ్య సులభంగా డేటా షేరింగ్‌కు వీలు కల్పించే డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లను ఏకీకృతం చేసే ఇంటర్‌ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్)కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 550 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో ఇది రూ. 300 కోట్లుగా ఉంది.
హోం శాఖకు 9 శాతం కేటాయింపులు పెరుగుదల
- Advertisement -
- Advertisement -



